Sirivennela song lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by Mickey J Meyer, and sung by Anurag Kulkarni from the movie Shyam Singha Roy.
| Song Name | Sirivennela |
| Singer | Anurag Kulkarni |
| Music | Mickey J Meyer |
| Lyricst | Sirivennela Seetharama Sastry |
| Movie | Shyam Singha Roy |
Sirivennela Song lyrics
(డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం) నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడిరాతిరిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కల (డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం) ఓ' ఛాంగురే ఇంతటిదా నా సిరి అన్నది ఈ శారద రాతిరి మిలమిల చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి అయ్యహో ఎంతటిదీ సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారి సుకుమారి ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాతిరి పూసిన వేకువరేఖలు రాసినవి నవల మౌనాలే మమతలై మధురాలా కవితలై తుదిచేరని కబురుల కథాకళి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కల (డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం) ఇదిలా అని ఎవరైనా చూపనేలేదు కంటికి అదెలాగో తనకైనా తోచనేలేదు మాటకి ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసినా ఆ రెంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా కథ కదిలే వరుసన తమ ఎదలేం తడిసినా గతజన్మల పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కల తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కల (డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం డుం డక డుం డక డుం డక డుండుం డుం డక డుం డక డుం డక డుం)
Watch Sirivennela Song Video
Sirivennela song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Sirivennela song is from this Shyam Singha Roy movie.
Anurag Kulkarni is the singer of this Sirivennela song.
This Sirivennela Song lyrics is penned by Sirivennela Seetharama Sastry.