Chiguraku Chatu song lyrics penned by Sirivennela Sitarama Sastry, music composed by Mani Sharma , and sung by S.P. Charan & Sujatha from the movie Gudumba Shakar.
| Song Name | Chiguraku Chatu |
| Singer | S.P. Charan & Sujatha |
| Music | Mani Sharma |
| Lyricst | Sirivennela Sitarama Sastry |
| Movie | Gudumba Shakar |
Chiguraku Chatu Song lyrics
చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా ఐతే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయట పడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా వణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం ఏదో తియ్యని మైకం పెంచుతున్నది దారే తెలియని దూరం తీరే తెలపని తీరం తనలో కలవరమేదో రేపుతున్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా తను కూడా నా లాగా అనుకుంటే మేలేగా ఐతే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయట పడదుగా
Watch Chiguraku Chatu Song Video
Chiguraku Chatu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Chiguraku Chatu song is from this Gudumba Shakar movie.
S.P. Charan & Sujatha is the singer of this Chiguraku Chatu song.
This Chiguraku Chatu Song lyrics is penned by Sirivennela Sitarama Sastry.